By Learn English With Rajesh
Introduction Class
హలో ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎలా ఉన్నారు…..
మీ అందరికీ 45 రోజుల స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్ కి స్వాగతం.. అనుకున్నట్టుగానే నేను స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్ ని PDF రూపంలో అందించటానికి ప్రయత్నం చేస్తున్నాను… రోజుకి ఒకటి లేదా రెండు Classes చొప్పున మీరు వింటూ నేను చెప్పే ఎక్సర్సైజెస్ (అభ్యాసాలను) ని మీరు చేసిన ఎడల మీరు కచ్చితంగా 45 రోజులలో ఇంగ్లీష్ మాట్లాడుతారు….
మొదటిగా మనము మనకి రాని భాష మనం నేర్చుకోవాలి అంటే మనం ఏం నేర్చుకోవాలి …. అదే ఇంగ్లీష్ విషయానికొస్తే మన ఏం నేర్చుకోవాలి.. నేను హిందీ నేర్చుకోవాలి అంటే మీరు ఏం చెబుతారు… మొదట మీరు మాట్లాడటం స్టార్ట్ చేయండి తర్వాత చిన్న చిన్న ప్రశ్నలు అడగండి వాటికి సమాధానాలు తెలుసుకోండి మీరు ఏదైనా ఒక సందర్భాన్ని వివరించండి అని మీరు నాకు సలహా ఇస్తారు…
కానీ కానీ స్పోకెన్ ఇంగ్లీష్ విషయానికి వచ్చేటప్పటికీ మన చుట్టుపక్కల ఉన్న వారు కావచ్చు మన స్నేహితులు కావచ్చు మనకి సరైన దిశానిర్దేశం చెయ్యరు. దీనికి కారణం ఇంగ్లీష్ అంటే ఉన్న భయమే.. ఇంగ్లీష్ కూడా మనము హిందీ నేర్చుకున్నట్టు లేదా ఏదైనా ఒక పరభాష నేర్చుకున్నట్టు చక్కగా ప్రశ్నలడుగుతూ సమాధానాలు చెబుతూ ఏదైనా ఒక సందర్భాన్ని వివరిస్తూ మనం తప్పులు చేస్తూ మనం నేర్చుకోవాలి… కాబట్టి ఒక భాష అనేది మాట్లాడేటప్పుడు ముఖ్యంగా మూడు రకాలుగా ఇది ఉపయోగపడుతుంది….
1. ప్రశ్నలు అడగటం (Asking Questions)
2. సమాధానాలు చెప్పడం (Giving Answers)
3. సందర్భాలను వివరించటం (Explaining)
వీటిని మనం చక్కగా నేర్చుకుంటే మనము ఎటువంటి భాష ఇంగ్లీష్ నేర్చుకోవచ్చు కాబట్టి మీరు చేయాల్సిందల్లా ఇంగ్లీష్ లో ప్రశ్నలు ఎలా అడగాలి సమాధానాలు ఎలా చెప్పాలి తర్వాత ఏదైనా ఒక సందర్భంలో తీసుకొని మనం ఎలా వివరించాలి…. మీకు భాష రావాలి అంటే మీరు కచ్చితంగా మాట్లాడాలి… క్లాసెస్ మీకు చాలా వరకు ఉపయోగపడతాయి. Classes మార్గనిర్దేశం చేస్తాయి. కానీ ప్రాక్టీస్ చేసే బాధ్యత మాత్రం మీదే, ప్రాక్టీస్ చేయకుండా ఏ భాష కావచ్చు లేకపోతే ఏమి కూడా మనకి రాదు కానీ ప్రాక్టీస్ మాత్రమే మనకి నేర్పిస్తుంది మీరు తప్పులు చేయవచ్చు కానీ మీరు నేర్చుకోవాలి (Learn By Committing Mistakes)
ఒక 10 నిమిషాలు క్లాస్ మీరు విన్నారు అంటే తర్వాత ఆ క్లాస్ని ఆ క్లాసు లో చెప్పిన అంశాలను తీసుకుని మీరు ఒక 60 నిమిషాల పాటు ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది ఇది మాత్రం మర్చిపోకూడదు….
అయితే భాష లో ఏమేమి ఉంటాయి అన్న విషయాన్ని మాత్రం మనం ముందుగా తెలుసుకోవాలి ఏముంటాయి ఒక భాషలో ఒక భాషను నేర్చుకోవాలి అని చెప్పండి ఒక భాషకు సంబంధించిన విషయాలు నేర్చుకోవాలి వాటిలో నైపుణ్యం సాధించాలి అనే అంశాలు ఆలోచించినప్పుడు… మనకు ముఖ్యంగా నాలుగు విషయాలపై స్పష్టమైన అవగాహన ఉండాలి లేదా వాటిని మనము నేర్చుకోవాలి అవేంటంటే…
1. GRAMMAR (వ్యాకరణం)
2. VOCABULARY (పదజాలం)
3. PRONUNCIATION (ఉచ్చారణ)
4. USAGE (ఉపయోగం)
ఇక్కడ మనకి గ్లామర్ అంటే భయపడాల్సిన అవసరం లేదు తెలుగులో వ్యాకరణం అంటాము అయితే మనము తెలుగు చాలా చక్కగా మాట్లాడతారు అంటే లేదు అని చెబుతాం ఎందుకంటే తెలుగు నేర్చుకున్నాము… తెలుగు నేర్చుకునే టప్పుడు ఉచ్చారణ దోషాలు ఉన్నా వ్యాకరణ దోషాలు ఉన్నా వాటి ఉపయోగం లో ఏమైనా తప్పులు ఉంటే మన పెద్దవాళ్ళు సరి చేశారు ఆ తప్పుల్ని మనము పదే పదే రిపీట్ చేయకుండా మనము తెలుగు నేర్చుకోవడం జరిగింది ఇంగ్లీష్ నేర్చుకోవాలి పూర్తిగా ఇంగ్లీష్ రాదు కానీ కొన్ని కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి వాటిని మనం ఖచ్చితంగా తెలుసుకుని ఆచరించాలి..
మనం తెలుగులో ఏ పదాన్ని ఎక్కడ ఎలా ఉపయోగించాలో ఒక స్పష్టమైన అవగాహనతో మనము భాషని మాట్లాడతాం అదే రకంగా ఇంగ్లీష్లో మాట్లాడేటప్పుడు మనము కొన్ని పదాలను ఎక్కడ ఇప్పుడు ఏ ఏ సందర్భాలలో ఉపయోగించాలి అనే విషయాలపై అవగాహన ఉండాలి ఇలా అవగాహన రావడానికి మనము ఒక VOCABULARY ని IMPROVE చేసుకోవాలి… ఈ vocabulary మనకి ఈ విధంగా ఉపయోగపడుతుంది అంటే మనము మాట్లాడేటప్పుడు మన భాష యొక్క Flow అనేది లేకుండా మనము ఎప్పుడు ఏ విధంగా ఎలా మాట్లాడాలో అలా మాట్లాడేటప్పుడు ఈ vocabulary ని ఎలా ఉపయోగించాలో మనకు సహాయం చేస్తుంది..
ఉచ్చారణ అనేది చాలా ముఖ్యమైన విషయం మనము మాట్లాడేవి అమెరికన్స్ లేదా బ్రిటిష్ అవుతుంది అయితే మనం ఖచ్చితంగా వారు ఏ విధంగా అయితే వారి యొక్క భాష అని మాట్లాడుతున్నారు మనము అలానే మాట్లాడాలి అని అన్న నియమం లేదు… మనం మరి ఎలా మాట్లాడాలి ఎలా మరి మన తెలుగు భాష ప్రభావం మన మన ఇంగ్లిష్ భాషపై పడకుండా అలా అని మనం పూర్తిగా ఇంగ్లీష్ ఇలా మాట్లాడకుండా … మధ్యే మార్గంలో మాట్లాడాలి దీనిని neutralized accent అంటారు… కాబట్టి మనము మనం ఇండియన్స్ మాట్లాడే ఇంగ్లీష్ నేర్చుకుంటే సరిపోతుంది …
ఈ పై మూడింటిని మనము నేర్చుకున్న తర్వాత మనము భాషని వుపయోగించడం నేర్చుకోవాలి మీరు భాష ని ఎంత బాగా ఉపయోగిస్తే మీకు మీరు అంత బాగా మాట్లాడగలరు అంతేకాకుండా భాష యొక్క నైపుణ్యాలు పెరుగుతాయి… భాషా నైపుణ్యాలను పెంచే బాధ్యత పూర్తిగా మాత్రమే ఆధారపడి ఉంటుంది అది చేయడం ద్వారా అంటే Practice … Practice Is The Only Mantra TO Get Success …
మరి ఇంకెందుకు ఆలస్యం ఈ 45 రోజుల స్పోకెన్ ఇంగ్లీష్ ని మనం చక్కగా ఫాలో అవుతూ నేను చెప్పిన మీరు చేస్తూ మీరు 45 రోజులలో ఒక నైపుణ్యం కలిగిన English Speaker గా మీరు తయారవ్వాలి… I Wish You All The Best
So ఆ విధంగా మనము స్పోకెన్ ఇంగ్లీష్ యొక్క ఉపోద్ఘాతం ని తెలుసుకున్నాము…
ఇదంతా మీకు వీడియో రూపంలో కావాలి అనుకుంటే మీరు ఈ క్రింద ఇవ్వబడిన Video లింక్ ని క్లిక్ చేయగలరు …
PDF రూపంలో కావాలి అనుకుంటే మీరు ఈ క్రింద ఇవ్వబడిన PDF లింక్ ని క్లిక్ చేయగలరు