Answers

Telugu To English Translation Exercises Class #1

మీరు కింద ఇవ్వబడిన వాక్యాలను పూర్తిగా చదివి ఒక పదాన్ని మరొక పదాన్ని ఇంగ్లీషులోకి తర్జుమా చేయకుండా మీరు వాక్యాన్ని పూర్తిగా చదివి ఆ చదివిన వాక్యం యొక్క అర్థాన్ని బేస్ చేసుకొని మీరు ఇంగ్లీషులో వాక్యాన్ని నిర్మించండి … ఇలా చేసిన తర్వాత Class #1 PDF డౌన్లోడ్ చేసుకుని మీరు మీయొక్క జవాబులను సరి చూసుకోగలరు…..

  1. అయితే
  2. ఇది నీకు ఓకే అయితే
  3. నాకు టైం ఉంటే
  4. నేను ఆలోచిస్తే
  5. నేను చేస్తే
  6. నేను వెళ్తే
  7. నేను వస్తే
  8. ఒకవేళ
  9. అక్కడ ఎవరూ లేకపోతే
  10. ఎవరు అంగీకరించకపోతే
  11. ఎవరైనా ఉంటే
  12. ఎవరైనా అంగీకరిస్తే
  13. నువ్వు ఆలోచిస్తే నువ్వు అనుకుంటే
  14. అవసరమైతే నేను వస్తాను
  15. వేడిగా ఉన్నా నేను ఏమి అనుకోను
  16. అవునుఇది ప్రేమ అంటే నాకు ఆశ్చర్యంగా ఉంది
  17. ఇది మీకు సమ్మతం అయితే నేను బాక్స్ ని ఓపెన్ చేస్తాను
  18. నువ్వు కావాలి అనుకుంటే వెళ్లొచ్చు.
  19. నాకు తెలీదు అతనికి తెలుసు ఏమో
  20. అతను రాజులాగా నటిస్తున్నాడు
  21. ఒకవేళ వర్షం పడ్డా నేను వెళ్ళాలి
  22. ఆమె అడిగింది అతను బిజీగా ఉన్నాడేమో అని
  23. అతన్ని అడిగాను అతనికి నా పేరు తెలుసేమో అని
  24. నేను నువ్వు అయితే నేను ఆ పని చేసేవాడు కాదు
  25. నా దగ్గర డబ్బులు ఉంటే నేను కొనేవాడిని
  26. ఆమె జానకి ఏనా అని అతను ఆమెని అడిగాడు
  27. నువ్వు కావాలి అనుకుంటే నువ్వు మీ ఇంటికి వెళ్ళవచ్చు
  28. ఆనందు ఇంటిదగ్గర ఉన్నాడేమో నీకు తెలుసా
  29. నాకు ఇటాలియన్ ఫుడ్ ఇష్టమేమో అని అతను నన్ను అడిగాడు
  30. అతను నాకు సహాయం చేస్తాడేమోనని అతని నేను అడిగాను
  31. కొంచెం వేడిగా ఉన్నా నేను పట్టించుకోను
  32. నాకు తెలియదు అది నా దగ్గర ఇంకా ఉందేమో
  33. నేను నువ్వైతే ఆపిల్ ఫోన్ ని కొనేసే వాడిని
  34. అతని అడిగాను అతనికి వాచ్ కావాలేమో
  35. ఒకవేళ వర్షం వచ్చినా సరే నేను అక్కడికి వెళ్తాను
  36. వాళ్లు పెళ్లి చేసుకుంటే
  37. నేను నువ్వైతే ఆ పని చేసే వాడిని కాదు
  38. నేను నువ్వు అయితే అతని నేను నమ్ముతాను
  39. ఆవిడకి అన్నీ తెలుసు అన్నట్లు నటిస్తోంది
  40. నువ్వు కావాలనుకుంటే నువ్వుఇక్కడ ఉండొచ్చు
  41. నేను టీవీ ని ఆన్ చేస్తే
  42. అతను ఒక ఎక్స్పర్ట్ లాగా మాట్లాడుతున్నాడు
  43. నేను ఫెయిల్ అయితే ఏంటి
  44. నువ్వు రాగలిగితే రా
  45. నీకు సాధ్యమైతే నన్ను ఆపు
  46. నేను మీకు సహాయం చేస్తాను మీకు కావాలి అనుకుంటే
  47. మీరు అంగీకరిస్తే నేను వెళతాను
  48. నేను ఇక్కడ కూర్చుంటే మీరు ఏమీ అనుకోరు కదా
  49. మీరు సిద్ధమా నేను సిద్ధమే
  50. నేను మొదలు పెడితే ఓకేనా
  51. వర్షం పడితే
  52. ఇది తుఫాన్ అయితే మనమేం చేయాలి
  53. నువ్వు వెళ్ళమంటే నేను వెళ్తాను
  54. వర్షం పడితే నేను ఇక్కడ ఉంటాను
  55. మీరు కావాలంటే/ మీకు అవసరమైతే నేను ఇక్కడ ఉంటాను
  56. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు
  57. మీకు కావాలంటే నేను అడుగుతాను
  58. ఆమెకి తెలిస్తే ఏమవుతుంది?
  59. మీకు అవసరమైతే నేను బయలుదేరుతాను
  60. నీకు అవసరమైతే నేను సహాయం చేయగలను
  61. అవసరమైతే నేను వస్తాను
  62. నువ్వు నన్ను వెళ్ళమంటే నేను వెళ్తాను
  63. జానకి ఇక్కడ ఉంటే నేను వెళ్ళిపోతాను
  64. అతను బిజీగా ఉంటే అతనిని నేను రేపు కలుస్తాను
  65. నువ్వుంటే నేనుంటా
  66. మీకు ఓకేనా నేను మీకు ఒక సలహా ఇస్తే
  67. నేను ఇక్కడ కూర్చుంటే ఓకే కదా
  68. మీరు కావాలనుకుంటే నాతో మాట్లాడొచ్చు
  69. నేను తప్పు అయితే మీరు సరిచేయవచ్చు
  70. ఆమె మా ఇంట్లో ఉన్నట్లయితే మనము పార్టీ ని ఎలా మొదలు పెడతాం
  71. దీనిని మీరు తీసుకువెళ్లాలి అనుకుంటే నేను మీకు సహాయం చేస్తాను
  72. నేను చేయాల్సి వస్తే నేను చేస్తాను
  73. మీకు అవసరమైతే నేను ఇక్కడ ఉంటాను
  74. నేను ఖచ్చితంగా చెప్పలేను ఒకవేళ నేను తప్పైతే
  75. నేను నిన్ను గాయపరిచి ఉంటే నన్ను క్షమించు
  76. మనం చూద్దాం ఒకవేళ అది పని చేస్తే
  77. నువ్వు ఫెయిల్ అయితే ఏం జరుగుతుంది?
  78. మీరు కావాలంటే మీరు కూర్చోగలరు
  79. నువ్వు కావాలంటే నువ్వు కూర్చో వచ్చు
  80. నీకు సహాయం అవసరమైతే నన్ను పిలువు
  81. నేను తప్పు అయితే మీరు సరి చేయగలరు
  82. వర్షం పడిన నేను పట్టించుకోను
  83. వేడిగా ఉన్నా నాకు ఇబ్బంది లేదు లేదా నేను పట్టించుకోను
  84. నాకు డౌట్ గా ఉంది సతీష్ సింగిల్ ఏనా
  85. నేను నువ్వైతే నేను వెళ్లిపోయే వాడిని
  86. అతను సొల్యూషన్ కనిపెడితే నేను చూస్తాను
  87. ఇది ఓకేనా నేను బాక్స్ ని ఓపెన్ చేస్తే
  88. అతను వస్తే అతన్ని వేచి ఉండమని చెప్పండి
  89. వర్షం పడితే నువ్వు నువ్వు తడుస్తావ్
  90. నువ్వు బాగా చదివితే నువ్వు ఎగ్జామ్ లో పాస్ అవుతావ్
  91. నువ్వు గౌరవం ఇచ్చినట్లయితే నువ్వు గౌరవింపబడే తావు
  92. నువ్వు ఐస్ ని వేడి చేస్తే ఐసు కరుగుతుంది
  93. నువ్వు అతని అడిగితే అతను నీకు సహాయం చేస్తాడు
  94. నువ్వు వారిని ఆహ్వానిస్తే వారు వస్తారు
  95. నువ్వు బాగా ఆడి ఉంటేగెలుస్తావు
  96. నువ్వు త్వరగా వెళ్లి ఉంటే బస్సుని పట్టుకుంటావు
  97. నువ్వు వారిని ఆహ్వానించినట్లయితే వారు వస్తారు
  98. మీరు బాగా ఆడుతుంటే మీరు గెలిచి ఉండేవాడు
  99. అతని నువ్వు అడిగి ఉంటే అతను నీకు సహాయం చేసేవాడు
  100. నువ్వు త్వరగా వెళ్లి ఉంటే నువ్వు బస్సు ని పట్టుకునే వాడివి

Leave a Comment

x